Header Banner

పంట పొలాల్లో ఎన్నారై జంట పెళ్లి! అసలు విషయం ఏంటంటే?

  Sat Feb 22, 2025 08:00        India

సాధారణంగా పెళ్లి అంటే మామూలు హడావుడి ఉండదు. వేసుకునే బట్టల దగ్గర నుంచి.. పెళ్లి పందిరి, లైటింగ్, డీజే, హంగు ఆర్భాటాలు సాధారణంగా ఉండవు. ఇక విదేశాల్లో ఉండేవారు పెళ్లి కోసం స్వదేశానికి వచ్చి.. లక్షలు, కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ ఎక్కడెక్కడికో వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక కొంతమంది అయితో సముద్రంలో పడవపై వెళ్తూ.. ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తూ పెళ్లిళ్లు కానిస్తున్నారు. కానీ ఈ ఎన్నారై జంట మాత్రం.. ఫంక్షన్ హాల్‌లో కాకుండా పంట పొలాల్లో పెళ్లి చేసుకుని.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వారు ఏదో సాధారణంగా తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. పంజాబ్‌లో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

 

పంజాబ్‌ ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని కారీకలాన్‌ గ్రామంలో బుధవారం ఒక పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి ఊరిలో కాకుండా గ్రామ శివార్లలో ఉన్న పంట పొలాల్లో నిర్వహించారు. పచ్చని పొలాల్లో టెంట్లు వేసి.. వాటికి రంగురంగుల లైట్లు పెట్టారు. బంధుమిత్రుల సమక్షంలో దుర్లభ్‌ సింగ్, హర్మన్‌ కౌర్‌ అనే జంట ఒక్కటైంది. అయితే అంతకుముందు వధువు హర్మన్‌ కౌర్‌ భారీ ఊరేగింపుతో వరుడు దుర్లభ్‌ సింగ్ ఇంటికి చేరుకుంది. అక్కడి నుంచి వారు ఊరి బయట పొలాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపానికి చేరుకున్నారు. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న దుర్లభ్ సింగ్, హర్మన్ కౌర్.. స్వదేశానికి వచ్చి ఇలా పెళ్లి చేసుకుని ఆదర్శవంతంగా నిలిచారు. అయితే పంట పొలాల్లో పెళ్లి చేసుకోవడం వెనుక.. రైతుల సమస్యలను ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశం ఉన్నట్లు ఆ జంట చెప్పింది. పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని.. ఢిల్లీ సరిహద్దుల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అన్నదాతలు ఏళ్ల తరబడి చేస్తున్న ఆందోళనలు చూసి.. వారి పరిస్థితిని అర్థం చేసుకుని తాము ఇలా పంట పొలాల్లో పెళ్లి చేసుకున్నట్లు దుర్లభ్ సింగ్, హర్మన్ కౌర్ జంట వెల్లడించింది. 

 

ఇక పంట పొలాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపాన్ని రకరకాల మొక్కలతో అలంకరించారు. పెళ్లి తంతు పూర్తి అయిన తర్వాత ఆ మొక్కలను వచ్చిన బంధువులు, అతిథులకు పంపిణీ చేశారు. అదేవిధంగా రైతుల నినాదాలు ముద్రించిన స్వీట్‌ బాక్సులను అందరికీ పంచిపెట్టారు. ఇక రైతులు ఉత్పత్తి చేసిన తేనె సీసాలను అందరికీ అందజేశారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. రైతుల ఆందోళనలను ఆదర్శంగా తీసుకున్న దుర్లభ్ సింగ్, హర్మన్ కౌర్ జంట.. పంట పొలాల్లో పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకుని వారి జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #NRIs #Marriage #Wedding